అమరులకు ఘన నివాళి .. రెండు నిమిషాల మౌనం

రాజన్న సిరిసిల్ల జిల్లా:దేశ స్వాతంత్య్ర ఉద్యమ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిసిరిసిల్ల( Sirisilla ) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఘన నివాళి అర్పించారు.అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి లు అమరులను స్మరించుకుంటూ 2నిమిషాలు వౌనం పాటించారు.

 Tribute To The Immortals Two Minutes Of Silence, Sirisilla, Rajanna Sirisilla-TeluguStop.com

జాతిపిత, మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ప్రతి ఏటా జనవరి 30 వ తేదీన స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి ( Gouthami Poojari )లు మాట్లాడుతూ…మహాత్ముడి గొప్ప ఆలోచనలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు సమష్టిగా ప్రయత్నించాలన్నారు.ఈరోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీరులకు నివాళులు అర్పించారు.

వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతిసారీ స్మరించుకోవడంతో పాటు….వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు శ్రీకాంత్, రమేష్ , ఈ డి ఎం శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube