విజయవాడ ఎంపీ కేశినేని నాని పై టీడీపీ నేత బుద్దా వెంకన్న( TDP Buddha Venkanna ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం కేశినేనికి అలవాటని విమర్శించారు.
ఈ క్రమంలో కేశినేనిపై తమ పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naiud ) పోటీ చేయాలా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
కేశినేని నానీ( Kesineni Nani ) కానీ ఆయన కుమార్తె కానీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయగలరా అని ప్రశ్నించారు.పశ్చిమ నుంచి పోటీ చేస్తే కేశినేని నానిని సుమారు 30 వేల ఓట్లతో ఓడిస్తామన్నారు.విజయవాడ నుంచి కేశినేని నాని మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారు.