బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అఖిల్ సార్థక్ (Akhil Sarthak) ఒకరు.బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం ద్వారా ఈయన కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వరకు హౌస్ లో కొనసాగారు.
అయితే ఈయన విన్నర్ అవుతారని అందరూ భావించినప్పటికీ రన్నర్( Runner ) గా బయటకు వచ్చారు.ఇలా సీజన్ ఫోర్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
ఇక్కడ కూడా ఈయన రన్నర్ గానే బయటకు వచ్చారు.

ఈ విధంగా అఖిల్ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అదే స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు.ఇకపోతే ఈయన రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.అవకాశాల కోసం ఏకంగా ఇంటి నుంచి దూరంగా ఉంటూ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అఖిల్ తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని తన ఒంటరితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఇల్లు ఈసీఐఎల్‌లో ఉందని అయితే ఏదైనా అవకాశాలు ఇవ్వడం కోసం డైరెక్టర్లు( Directors ) ఫోన్ చేస్తే తాను ఈసీఐఎల్‌లో ఉన్నానని చెబితే అంత దూరంలో ఉన్నారా అంటూ మాట్లాడేవారు అందుకే ఎవరైనా కాల్ చేస్తే వెంటనే కలిసేలా ఇండస్ట్రీకి దగ్గరగా వచ్చానని తెలిపారు.ఇలా ఇంటిని వదిలేసి ఒంటరిగా ఉండటం తన మెంటల్ హెల్త్ పై చాలా ప్రభావం చూపిస్తోందని, ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటూ అఖిల్ ఎమోషనల్ అయ్యారు.ఎక్కడో విదేశాల్లో ఉంటూ చాలామంది ఒంటరిగా ఉన్నాం అంటారు.
కానీ తాను ఇంటికి గంటన్నర దూరంలో ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నానని తెలిపారు.







