boAt స్నేహపూర్వక బడ్జెట్లో ఎయిర్ డోప్స్ 91 ఇయర్ బడ్స్( Airdopes 91 Earbuds ) ను లాంఛ్ చేసింది.ఈ ఇయర్ బడ్స్ కు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
ఈ ఇయర్ బడ్స్ సౌకర్యవంతమైన ఇన్ ఇయర్ డిజైన్ తో ఉంటుంది.ఈ ఇయర్ బడ్స్ 45 గంటల ప్లే టైం ను అందిస్తాయి.
ASAP చార్జ్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి.టైప్ సి కనెక్టర్ తో ఉంటుంది.
కేవలం పది నిమిషాలు చార్జింగ్ చేస్తే 120 నిమిషాల ప్లే టైం అందిస్తాయి.ఇందులో 10 ఎంఎం డ్రైవర్లు, boAt సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ అమర్చబడి ఉంటుంది.

కాల్ నాణ్యత మెరుగుపరచడం కోసం డ్యూయల్ మైక్ ENx టెక్నాలజీ తో ఉంటాయి.ఇవి వాయిస్ అసిస్టెంట్లకు( Voice Assistants ) మద్దతు ఇస్తాయి.IPX4 రేటింగ్ ను కలిగి ఉంటాయి.ఇవి 50ms తక్కువ లేటెన్సీ మోడ్ తో వస్తుంది.
నీటి స్ప్లాష్ లు, చెమటకు నిరోధకతను కలిగి ఉంటాయి.ఇక ఎయిర్ డోప్స్ 91 ఇయర్ బడ్స్ ధర విషయానికి వస్తే.ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమెజాన్( Amazon ) మరియు boAt వెబ్ సైట్ లో రూ.1199 కే కొనుగోలు చేయవచ్చు.

ఈ ఇయర్ బడ్స్ మిస్ట్ గ్రే, స్టార్రీ బ్లూ, యాక్టివ్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి.ఇటీవలే boAt నుంచి ఇమ్మోర్టల్ 201 ఇయర్ బడ్స్( Immortal 201 Earbuds ) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఇయర్ బడ్స్ 50 గంటల ప్లే టైం అందిస్తాయి.ASAP చార్జ్ టెక్నాలజీ తో కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 180 నిమిషాల ప్లే టైం అందిస్తాయి.ఈ ఇమ్మోర్టల్ 201 ఇయర్ బడ్స్ ధర రూ.2299 కే పొందవచ్చు.ఈ ఇయర్ బడ్స్ గ్రే, గన్ మెటల్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి.







