50లోనూ యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

వయసు పైబడే కొద్దీ చర్మం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.నుదుటి మీద ముడతలు, కళ్ల చివర్ల గీతాలు, చర్మం సాగటం.

 Follow These Simple Tips For Youthful Skin!, Youthful Skin, Skin Care, Skin Care-TeluguStop.com

వయసు పైబడిన తర్వాత కనిపించే లక్షణాలు.ఈ వృద్ధాప్య ఛాయలు కారణంగా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలంటేనే సంకోచిస్తుంటారు.

అలాగని వృద్ధాప్య ఛాయలను వల్ల కృంగిపోవాల్సిన‌ అవసరం లేదు.చర్మపు బిగుతును పెంచి, ముడతలను( Wrinkles ) మటుమాయం చేసే సూపర్ టిప్స్ కొన్ని ఉన్నాయి.

ఈ టిప్స్ ను పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటే 50లోనూ యంగ్ గా కనిపిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం చర్మం యొక్క‌ యవ్వనాన్ని పెంచే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Remedy, Latest, Simple Tips, Skin Care, Skin Care Tips, Youthful Sk

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ రసం( Cucumber Juice ), వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీ మీ చర్మాన్ని తేమ‌గా ఉంచుతుంది.ముడతలను మాయం చేస్తుంది.మరియు సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.

అలాగే ఒక కప్పు గ్రీన్ టీ లో అరకప్పు రోజ్‌ వాటర్( Rose Water ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మంచి టోనర్ సిద్ధమవుతోంది.ఈ టోనర్ వృద్ధాప్య ఛాయలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

నిత్యం ఈ టోనర్ ను వాడటం వల్ల స్కిన్ టైట్ అవుతుంది.గ్లోయింగ్ గా మారుతుంది.

మరియు చర్మం పై గీతలు సైతం మాయమవుతాయి.

Telugu Tips, Remedy, Latest, Simple Tips, Skin Care, Skin Care Tips, Youthful Sk

ఇక యూత్‌ఫుల్ స్కిన్ కోసం ఒక గుడ్డు తెల్లసొనలో( Egg White ) రెండు టేబుల్ స్పూన్లు అరటి పండు ప్యూరీ( Banana Puree )ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించండి 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి.ఈ రెమెడీ యవ్వన ఛాయలను సహజంగానే ప్రోత్సహిస్తుంది.వారంలో మూడు సార్లు ఏ రెమెడీని పాటిస్తే 50 లోనూ మీరు యంగ్ గా కనిపిస్తారు.

అందగా మెరిసిపోతారు.ఇక ఈ టిప్స్ తో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించండి.నిత్యం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.

మరియు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube