Anupama Parameswaran : ఏంటి.. అనుపమకు పెళ్లి అయిపోయిందా.. మెడలో తాళి చూపిస్తూ అలా?

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Beautiful Anupamaparameswaran Aces Bridal Look In Her Latest Clicks-TeluguStop.com

ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు.

అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది.

ప్రస్తుతం అను మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి.ఈగల్, టిల్లు స్క్వేర్( DJ Tillu Square ) ఈ రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఇక ఇవే కాకుండా తమిళ్ లో జయం రవి సరసన సైరెన్ సినిమా( Siren )లో నటిస్తోంది.సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది అనుపమ.

అందులో భాగంగానే తాజాగా అను పెళ్లికూతురుగా మారిపోయింది.పట్టుచీర, ఒంటినిండా నగలు ధరించి మెడలో తాళిని చూపిస్తూ కనిపించింది.

దీంతో ఫ్యాన్స్ సడెన్ గా చూసి అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా?( Anupama Parameswaran Marriage ) అంటూ ఫీల్ అయిపోతున్నారు.కానీ, అది నిజమైన పెళ్లి కాదు.ఆమె నటించిన సైరెన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.అందులో అనుపమ, జయం రవిని పెళ్లి చేసుకుంటుంది.ఆ సాంగ్ లోని మేకింగ్ స్టిల్స్ నే ఈ చిన్నది షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఆ ఫోటోలపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.సినిమా అయితే పర్లేదు నిజమైన పెళ్లి అనుకునే భయపడి చచ్చాము అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube