ఇండియన్ ఐడల్ పేరుతో సౌత్ సింగర్స్ పై దారుణం గా విషం కక్కుతున్న నార్త్ ఇండియన్స్

ఎవరు అవునన్నా కాదన్నా పాటల పోటీల గురించి మాట్లాడు కోవాల్సి వస్తే ఖచ్చితంగా ఇండియన్ ఐడల్ షో( Indian Idol Show ) తో మరే షో కూడా పోటీకి రాదు.టి ఆర్ పి కోసం అప్పుడప్పుడు కొన్ని చెత్త వేశాలు వేసిన మిగతా అన్ని షోలతో పోలిస్తే ఇది ఎంతో బెటర్.

 North Indian Are Not Interested In Our Hindi , Hindi, North Indian, Indian Idol-TeluguStop.com

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఈ షో స్టాండర్డ్స్ లో కూడా ఎలాంటి రాజీపడదు.హోస్ట్, జడ్జ్, కంటెస్టెంట్ల ఎంపిక, ఆర్కెస్ట్రాతో సహా అన్ని కూడా చాలా బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

అందుకే ఇది దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించింది.అలరిస్తూనే ఉంది.

ఇక ఇప్పుడు ఈ షో 14 వ సీజన్ నడుస్తుంది ఈసారి కూడా ఇంతకు ముందు సీజన్స్ కన్నా కూడా చాలా ఆకర్షణయంగా అందంగా ముస్తాబై ప్రేక్షకుల ముందు వస్తుంది.

Telugu Hindi, Karnataka, Kerala, Indian, India, Tamil Nadu-Telugu Top Posts

గత 13 సీజన్స్ కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇండియా మొత్తంగా రకరకాల ప్రాంతాల నుంచి కంటస్టెంట్స్ ని తీసుకొచ్చి ఈ షోలో పార్టిస్పెట్ చేయిస్తారు.అయితే దేశంలోని అందరూ కూడా ఒకే భాషతో ఉండరు కదా.హిందీలో మాత్రమే ఈ షోలో పాటలు పాడాలి.అక్కడే అసలు దెబ్బ కొడుతుంది.

ఎందుకంటే సౌత్ ఇండియా( South India ) నుంచి వెళ్లే సింగర్స్ ని ఈ షోలో ఎక్కువగా పట్టించుకోరు అలాగే ప్రేక్షకులు కూడా మనవాళ్లు పాడే హిందీని ఓన్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.ఇక సౌత్ ఇండియాలోని రా మిగతా రాష్ట్రాల విషయానికొస్తే కర్ణాటక( Karnataka ) పూర్తిగా హిందీ చెత్తగా మాట్లాడుతారు.

Telugu Hindi, Karnataka, Kerala, Indian, India, Tamil Nadu-Telugu Top Posts

తమిళనాడు కేరళ వాళ్లయితే హిందీ మాట్లాడడానికి అసలు ఇష్టపడరు కూడా.వాళ్లు మాట్లాడే హిందీని సౌత్ ఇండియన్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసిన నార్త్ ఇండియాలో ఆ పప్పులు ఉడకవు ఎంతో కొంత మన రెండు తెలుగు రాష్ట్రాలు బెటర్ అని చెప్పుకోవచ్చు.ఇప్పటి వరకు గత 13 సీజన్స్ లలో 12 మంది సౌత్ ఇండియన్స్ పాల్గొనగా అందులో ఆరుగురు తెలుగు సింగర్స్ ఉండడం చెప్పుకోవాల్సిన విషయం.ఇక ఎంతటి ఘనమైన గాయకుడు అయినా ఎస్పీ బాలు సైతం నార్త్ లో ఎంతో వివక్షకు గురయ్యారు అందుకే చాలామంది హిందీలో పాటలు పడడానికి సుముఖంగా ఉండరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube