తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కస్త్టపడుతు ఉంటారు.అందుకే వాళ్ళు చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలి అంటే ముందుగా వాళ్లకు జనాల్లో క్రేజ్ అయితే ఉండాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మొదట కొన్ని సినిమాల్లో అలరించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.ఇక అలాంటి వాళ్ళలో సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) ఒకడు.
ఈయన మొదట్లో వరుసగా మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు అయినప్పటికీ మధ్యలో కొద్దిగా డల్ అయ్యాడు.

ఇక మళ్ళీ విరూపాక్ష( Virupaksha ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తను బ్రో సినిమాతో మరో ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు.మరి ఇలాంటి క్రమం లో ఆయన నెక్స్ట్ సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో గాంజా శంకర్ ( Ganja Shankar )అనే సినిమా చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
గాంజా శంకర్ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో తెలంగాణ యాసని మాట్లాడుతూ ఉంటుంది.కాబట్టి ఈ సినిమాతో మరోసారి సాయి ధరమ్ తేజ్ కొత్త రకం క్యారెక్టర్ ని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన ఎంత ట్రై చేసినప్పటికీ కథలో దమ్ముంటేనే సినిమా ఆడుతుంది అని ఇప్పటికి మనం చాలా సార్లు చూశాం… క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపిస్తే ఆయనకు మాత్రమే పేరొస్తుంది,కానీ సక్సెస్ అయితే రాదు.

అందువల్ల కథలో మ్యాటర్ ఉండాలి మరి సంపత్ నంది స్టార్ డైరెక్టర్ కాదు కాబట్టి ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదే కాకుండా సాయి దరం తేజ్ మరో కొత్త దర్శకుడుతో ఒక సినిమా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆ కొత్త దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు.
కానీ తొందరలోనే ఆయనతో చేసే సినిమాని అనౌన్స్ చేయనున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా బిబిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో రాబోతున్నట్టు గా తెలుస్తుంది.








