పవన్ ని చూసినట్టుంది.. అకీరా వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫ్యాన్స్?

టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కొడుకు అకీరా నందన్( Akira Nandan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అకీరా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే.

 Akira Nandan Photos Viral In Social Media, Akira Nandan, Photos Viral, Social Me-TeluguStop.com

ప్రస్తుతం తల్లి వద్దే ఉంటూ విదేశాలలో చదువుకుంటున్నాడు అకీరా నందన్.కాగా అకీరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కావడంతో అతనికి సంబంధించిన ఎటువంటి వార్త అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా తండ్రీ కొడుకులకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాధారణంగా ప్రతి కొడుకు తన తండ్రిలానే ఉంటాడు.

కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు.ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు.ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ లా కనిపిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు అకీరా కూడా అచ్చం అలాగే కనిపిస్తున్నాడు.

తాజాగా రేణు అకీరా ఫోటోలను షేర్ చేసింది.అందులో రగ్గడ్ గడ్డం గాగుల్స్ పెట్టుకొని అకీరా కనిపించాడు.ఇది కాకుండా అకీరా నూనూగు మీసాలతో ఉన్నది, క్లీన్ షేవ్ తో ఉన్న వీడియోని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.ఇక ఈ లుక్స్ అన్ని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తున్నాయి.

తండ్రి కొడుకుల ఫోటోలను పక్కన పెట్టి అభిమానులు లైక్ ఫాదర్, లైక్ సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే అకీరాను చూస్తుంటే ఖుషిలో పవన్ గుర్తురాకమానడు.దీంతో పవన్ కళ్యాణ్, అకిరా నందన్ ఫోటోలను పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఆ ఫోటోలను చూసిన అభిమానులు అకీరా ను చూస్తుంటే అచ్చం పవన్ కళ్యాణ్ ని చూసినట్టుంది.

అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటి ఇలా ఉన్నారు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అకీరా ని మీసం గడ్డలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube