టాలీవుడ్ విలన్లలో తోపు ప్రకాష్ రాజేనా.. ఆయన స్థాయిలో ఎవరూ న్యాయం చేయలేరంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.విలన్ గా, తండ్రి పాత్రలో, పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇలా ఎలాంటి రోల్ ఇచ్చినా న్యాయం చేసే విషయంలో ప్రకాష్ రాజ్ ముందు వరసలో ఉంటారు.

 Prakash Raj Is The Number One Artist In Tollywood Industry Details Here Goes Vi-TeluguStop.com

అయితే టాలీవుడ్ విలన్లలో తోపు ప్రకాష్ రాజేనని ఈ జనరేషన్ లో ఆయన స్థాయిలో ఎవరూ న్యాయం చేయలేరంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రకాష్ రాజ్ తెలుగులో దాదాపుగా అందరు అగ్ర హీరోల సినిమాలలో పని చేశారు.

ప్రకాష్ రాజ్ కంటే ముందు, వెనుక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది విలన్లు సరైన ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరం కాగా ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటికీ తన నటనతో మెప్పిస్తున్నారు.

Telugu Dookudu, Kolllywood, Mahesh Babu, Prakash Raj, Tollywood-Movie

గుంటూరు కారం సినిమాలో తాత పాత్రలో కనిపించి ప్రకాష్ రాజ్ మెప్పించారు.తనకు సమానంగా వయస్సు ఉన్న హీరోలకు సైతం తండ్రిగా నటించడం ప్రకాష్ రాజ్ కే చెల్లింది.

Telugu Dookudu, Kolllywood, Mahesh Babu, Prakash Raj, Tollywood-Movie

ఒకే తరహా పాత్రలను ఎక్కువ సంఖ్యలో సినిమాలలో చేసినా పాత్రకు పాత్రకు మధ్య వైవిధ్యం ఉండేలా ప్రకాష్ రాజ్ జాగ్రత్తలు తీసుకుంటారు.ఎన్నో సినిమాల సక్సెస్ లో ప్రకాష్ రాజ్ పాత్ర ఉంది.ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండవచ్చు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

ప్రకాష్ రాజ్ పారితోషికం( Remuneration ) భారీ రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో సైతం ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది.

Telugu Dookudu, Kolllywood, Mahesh Babu, Prakash Raj, Tollywood-Movie

భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించి సత్తా చాటడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు ప్రకాష్ రాజ్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయని చాలా సందర్భాల్లో కామెంట్లు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube