కుక్కలు( Dogs ) తమ యజమానులు ప్రమాదంలో ఉంటే వెంటనే పసిగడతాయి.ఓనర్లు అనారోగ్యం బారిన పడినా అవి ఆ విషయం తెలుసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాయి.
తాజాగా ఒక కుక్క కళ్ళు తిరుగుతున్న తన యజమానికి( Owner ) టాబ్లెట్స్, వాటర్ ఇవ్వాలని తెలుసుకుంది.అంతే వెంటనే అది తన యజమానికి మెడిసిన్స్ అందించి, వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది.
ఆపై ఆమె లేవకుండా కాళ్ళ మీద పడుకుంది.లేస్తే ఆమెకు కళ్ళు తిరిగే సమస్య ఉందట.
దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

ఈ వీడియోకు ఇప్పటికే 2 కోట్ల 33 లక్షల వ్యూస్ వచ్చాయి.@Yoda4ever ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 2 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక యువతి తన కుర్చీలో కూర్చొని ల్యాప్‌టాప్‌లో ( Laptop ) ఏదో పని చేస్తున్నట్లు కనిపించింది.
తర్వాత ఆమె కుర్చీలోంచి లేచి ఎక్కడికో వెళ్లాలనుకుంది కానీ ఆమెకున్న అనారోగ్యం వల్ల కళ్ళు తిరిగినట్టు అనిపించాయి.ఇది గమనించిన కుక్క వెంటనే ఆమెను కూర్చోబెట్టి, అనంతరం మెడిసిన్స్( Medicines ) అందించింది.

ఆపై ఫ్రిడ్జ్ డోర్ తీసి వాటర్ బాటిల్( Water Bottle ) నోటిలో పెట్టుకుని చేతికి అందించింది.దాంతో ఆ యువతి టాబ్లెట్స్ వేసుకొని ఆ పరిస్థితి నుంచి బయటపడింది.”యజమాని గుండె, రక్తం సమస్యలతో బాధపడుతోంది.ఆమె లేచి నిలబడితే తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
కుక్క ఈ విషయం తెలుసుకుని ఆమెకు సహాయం చేస్తుంది.ఆమెను కూర్చోబెట్టి నీళ్ళు, మాత్రలు చాలా వేగంగా అందించింది.” అని ఈ వీడియోకు ఒక క్యాప్షన్ జోడించారు.







