చిన్న పత్రికా విలేకరుల ఇల్ల స్థలాలకై మంత్రికి వినతిపత్రం

నల్లగొండ జిల్లా:చిన్న పత్రికల్లో పని చేస్తున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy )కి నల్లగొండ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ నాయకులు తెలిపారు.

 Petition To The Minister For Housing Sites For Small Press Reporters, Komatiredd-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా( Nalgonda District ) కేంద్రంలో సుమారు 50 మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస,పక్ష,వార పత్రికలు నడుపుతున్నారన్నారు.గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారం( Financial burden )తో సతమతమవుతున్నారని, సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వైపు పత్రికా నిర్వహణ, మరొకవైపు కుటుంబ పోషణ భారాన్ని భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు.పాత్రికేయుల పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రిల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాదీనం,సోమవారపు యాదయ్య,ఎండీ.మక్సుద్,వెన్నమల్ల రమేష్ బాబు, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube