భారత సంతతి విద్యార్ధి మృతి.. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదు

గత వీకెండ్‌లో ‘‘ hypothermia ’’ (అత్యంత శీతల ఉష్ణోగ్రత పరిస్థితి)తో మరణించిన భారతీయ అమెరికన్ యువకుడి తల్లిదండ్రులు, మృతుడు చదివిన యూనివర్సిటీ పోలీస్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా ఛాంపెయిన్‌లో( University of Illinois Urbana-Champaign ) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న 18 అకుల్ బి ధావన్( Akul B Dhawan ) గత శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అదృశ్యమైనట్లుగా యూఎస్ఏ టుడే నివేదించింది.

 Indian-american Parents Accuse Illinois University Of Negligence After Teen Son-TeluguStop.com

యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పోలీసుల ప్రకారం.

అకుల్‌ను దాదాపు 10 గంటల తర్వాత పశ్చిమ అర్బానాలోని( West Urbana ) యూనివర్సిటీ క్యాంపస్‌కు సమీపంలో వున్న భవనం వెనుక వరండాలో కనుగొన్నారు.ఆ సమయంలో తీవ్రంగా గడ్డకట్టే ఉష్ణోగ్రతలు -20 , -30 డిగ్రీల మధ్య నమోదైనట్లుగా తెలుస్తోంది.

తమ కుమారుడి ఫోన్‌లోని లోకేషన్ ట్రాకింగ్ డేటాను బట్టి తప్పిపోయిన ప్రదేశానికి కేవలం 400 అడుగుల దూరంలోనే అకుల్ ఆచూకీ దొరికిందని ఇష్, రీతూ ధావన్‌ దంపతులు బుధవారం పేర్కొన్నారు.

Telugu Akul Dhawan, Hypothermia, Illinois, Indian American, Negligence, Teen Son

యూనివర్సిటీ పోలీస్ విభాగం( University of Illinois Police ) నిర్లక్ష్యంగా వుందని ఆరోపిస్తూ దర్యాప్తు జరిగిన తీరుపై వారు ఫిర్యాదు చేశారు.మా కుమారుడి మరణంపై తలెత్తుతోన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలని అకుల్ ధావన్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.కాలిఫోర్నియాలోని ఇంటి దగ్గరే చదువుకోవాలని తల్లిదంద్రులు కోరినప్పటికీ, వారి మాటలను బేఖాతరు చేస్తూ రోబోటిక్స్( Robotics ) అధ్యయనం చేసేందుకు అకుల్ .యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లోని ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో చేరారు.

Telugu Akul Dhawan, Hypothermia, Illinois, Indian American, Negligence, Teen Son

అకుల్ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు క్యాంపస్ పోలీసులు, ఇల్లినాయిస్ స్టేట్ పోలీసులు, ఛాంపెయిన్ కౌంటీ కరోనర్ కార్యాలయం దర్యాప్తు చేస్తోంది.కరోనర్ కార్యాలయం ప్రకారం.మంగళవారం నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్టు మాత్రం అల్పోష్ణ స్థితి వల్లే అకుల్ మరణించినట్లుగా చెబుతోంది.

ఈ ఘటనపై ఎలాంటి సమాచారం వున్నా తమను సంప్రదించాలని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube