రాజన్న సిరిసిల్ల జిల్లా: ఒంటరిగా తిరుగుతున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సిరిసిల్ల రూరల్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) వెల్లడించారు.ఇద్దరు నింధితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సిరిసిల్ల రూరల్ సి.
ఐ సదన్ కుమార్, ఆర్.ఎస్.ఐ జునైద్,సిబ్బంది నరేందర్, రాజశేఖర్, శ్రీనివాస్, అక్షర్ లను అభినందించి రివార్డు అందజేషిన జిల్లా ఎస్పీ.
నిందుతుల వివరాలు.1.సిద్ధన యదవ్వ పద్మనాభం పల్లి గ్రామం దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2.బోదాసు నరేష్ పెద్దగుండవెల్లి గ్రామం దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన రుద్రాపు పోషవ్వ 75 సం.అనే వృద్ధ మహిళ అనారోగ్యం(జ్వరం) రీత్యా తేదీ 12.1.2024 రోజున మధ్యాహ్నం అందాజా 03:30 నిమిషాలకు జిల్లెళ్ల క్రాసింగ్ వద్ద గల ఆర్ఎంపీ డాక్టర్ లింగారెడ్డి వద్దకు వెళ్లి ఇంజక్షన్ చేయించుకుని తిరిగి తన ఇంటికి నడిచి వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు జంట ఆడ, మగ వ్యక్తులు ఒక బైక్ పై పోషవ్వ దగ్గరకు వచ్చి నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పగా, వారి మాటలు నమ్మి వారితో బండిమీద వెళ్ళగా వారు ఆమెను ఇంటి వద్ద దింపే క్రమంలో బలవంతంగా ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పారిపోయారు .పోషవ్వ తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా అట్టి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సిరిసిల్ల రూరల్ సి.ఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్.ఎస్.ఐ జునైద్ , సిబ్బంది తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నేరేళ్ల , జిల్లెళ్ల క్రాస్ రోడ్, మల్లాపూర్ దేవాలయం, తెర్లుమద్ది, మొర్రాపూర్ బదనకల్, పోత్గల్ ,ముస్తాబాద్, రేగులకుంట గ్రామాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి తేదీ 26-1- 2024 రోజున సాయంత్రం అందాజ నాలుగు గంటల ప్రాంతంలో బద్దెనపల్లి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానంగా కనపడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు సిద్ధన యదవ్వ భర్త ఓదేలయ్య వయసు 33 సంవత్సరాలు, పద్మనాభం పల్లి గ్రామం దుబ్బాక మండలం ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నానని తెలిపి ఆమెతోపాటు బోదాసు నరేష్ తండ్రి ఎల్లయ్య, 30 సంవత్సరాలు, పెద్దగుండవెల్లి గ్రామం దుబ్బాక మండలం( Dubbaka ) ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నారు అని తెలిపారు.
వీరిద్దరూ కలిసి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని భావించి ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నామని పై దోపిడీ కూడా మేమె చేశామని విచారణ లో ఒప్పుకోవడం జరిగిందని అనంతరం ఇద్దరిని ఈ రోజు రిమాండ్ కి తహరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.
గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దని, మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.నేర నియంత్రణ లో ,నిందుతులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తామని అందువలన ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.