సూర్యాపేట జిల్లా: సూర్యాపేట( Suryapet ) మున్సిపల్ పరిధిలోని చారిత్రక శివాలయాలను హైకోర్టు జడ్జ్ పుల్ల కార్తీక్( Justice Pulla Karthik ) శనివారం సందర్శించారు.ఎరకేశ్వర, నామేశ్వర, త్రికుటాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గుంత రాజగోపాల్, జూనియర్ సివిల్ జడ్జ్ జే ప్రశాంతి,అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి,ఆర్డిఓ కృష్ణయ్య,డిఎస్పి నాగభూషణం,సీఐ అశోక్( Ashok ), రూరల్ ఎస్సై సాయిరాం, ట్రాఫిక్ ఎస్ఐ నవీన్, శివాలయాల కమిటీ చైర్మన్ భిక్షం,సిబ్బంది ఉన్నారు.