Rakul Preet Singh: ఎందుకు తెలుగులో రకుల్ ప్రీత్ కనిపించడం లేదు… ఈ అమ్మడు బోర్ కొట్టేసిందా ?

చాలా మంది రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర రంగానికి పరిచయమైంది అని అనుకుంటారు.కానీ ఆమె అంత కన్నా రెండేళ్ల ముందే కెరటం అనే సినిమాతో మొదటగా టాలీవుడ్ డెబ్యూ చేసింది.

 Rakul Preet Is Not Interested In Telugu-TeluguStop.com

అంతకన్నా ముందు కన్నడలో ఒక చిత్రం మాత్రమే చేసింది.ఇంకా ఆ తర్వాత తెలుగు, తమిళ్ మరియు హిందీ చిత్రాలతో బిజీ బిజీగా దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాల్లో నటిస్తూనే ఉంది.

ఇప్పటికీ ఆమె చేతిలో ఒక హిందీ, ఒక తమిళ సినిమాలు ఉన్నాయి.ఇప్పటికే 2024లో అయాలన్ ( Ayalaan Movie ) అనే శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu Ayalaan, Indian, Kondapolam, Rakul Preet, Rakulpreet, Tollywood-Movie

తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చివరి సినిమా కొండ పొలం.( Kondapolam ) ఆ తర్వాత భూ అనే ఒక ఏదో థ్రిల్లర్ లో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన అది తమిళ చిత్రం గానే జనాలు పరిగణించారు.మరి దాదాపు మూడేళ్లుగా తెలుగులో కనిపించకుండా పోయిన రకుల్ ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే ప్రశ్న ఆమె అభిమానుల్లో నెలకొని ఉంది.మరి హిందీ సినిమాలపై( Hindi Movies ) అమితంగా ప్రేమ కురిపిస్తున్న రకుల్ తెలుగు సినిమాలో ఒప్పుకోవడం లేదా లేక తెలుగు కథలతో దర్శకులు ఆమెను అప్రోచ్ అవడం లేదా అనే ప్రశ్న కూడా అందరిలో మెదులుతుంది.

ఏది ఏమైనా ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని( Tollywood ) ఉర్రూతలగించిన రకుల్ తెలుగు సినిమాల్లో నటిస్తేనే చూడాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు.

Telugu Ayalaan, Indian, Kondapolam, Rakul Preet, Rakulpreet, Tollywood-Movie

2022లో ఆరు హిందీ చిత్రాలలో నటించిన రకుల్ ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేదు.2023లో రెండు హింది చిత్రాల్లో నటించింది.2024 లో శివ కార్తికేయన్ సినిమా కాక మేరే పత్ని కా రీమేక్ అనే ఒక హిందీ సినిమా అలాగే కమల్ హాసన్ తో ఇండియన్ 2( Indian 2 ) చిత్రంలో నటిస్తుంది.ఇండియన్ 2 సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది దాంతో మళ్లీ ఆమెను తెలుగులో పిలుస్తారా అని ఆశతో రకుల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.వాస్తవానికి నాగార్జునతో మన్మధుడు 2( Manmadhudu 2 ) సినిమాలో నటించిన తర్వాత నుంచి ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి అనేది ఒక టాక్.

పైగా కొండ పొలం లాంటి ఒక సినిమాలో కుర్ర హీరోతో రకుల్ వయసు లో పెద్ద అమ్మాయి గా కనిపించడం కూడా ఆమెకు మైనస్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube