సాధారణంగా ఎన్టీఆర్( NTR ) సిగరెట్స్ కాల్చరు.కేవలం సినిమా కోసం మాత్రమే కాలుస్తారు.
మామూలు రోజుల్లో ఆయన చుట్ట మాత్రమే కాలుస్తారు.అయితే గుడిగంటలు( Gudigantalu Movie ) అనే సినిమా కోసం ఎన్టీఆర్ సిగరెట్స్( Cigarettes ) కాల్చారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య, కృష్ణకుమారి ప్రధాన పాత్రలో నటించారు.డుండి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి వి.మధుసూదన్ రావు దర్శకుడిగా ఈ చిత్రం మొదలైంది ఆలయ మణి అనే ఒక తమిళ సినిమాను తెలుగులో గుడిగంటలు పేరుతో రీమేక్ చేశారు.తమిళ వర్షన్ లో శివాజీ గణేషన్ పోషించిన నెగటివ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.
దీంట్లో శాడిజం లక్షణాలు ఉన్న ఎన్టీఆర్ సిగరెట్లు తాగే అలవాటుతో.

అయితే ఈ షూటింగ్ జరుగుతుందని రోజులు స్టేట్ ఎక్స్‌ప్రెస్( State Express ) అనే ఒక ఫారిన్ బ్రాండ్ సిగరెట్స్ తాగడం ఎన్టీఆర్ మొదలు పెట్టారు ప్రతిరోజు రెండు డబ్బాల సిగరెట్స్ కాల్చేవారు.పొద్దున్నే షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు ఒక బాక్స్ అలాగే లంచ్ తర్వాత మరొక బాక్స్ ప్రొడక్షన్ వారు ఎన్టీఆర్ కి ఇచ్చేవాళ్ళు.ఒక్కో బాక్స్ లో 20 సిగరెట్స్ ఉంటాయి.
గుండ్రంగా ఉండి చాలా పాష్ గా ఉండే ఈ సిగరెట్ ఫారెన్ బ్రాండ్( Foreign Brand ) కావడంతో ఎక్కడపడితే అక్కడ లభించేది కాదు.అయితే ఒక రోజు లంచ్ తర్వాత ఎన్టీఆర్ సిగరెట్స్ తీసుకోవడానికి ముందే నిర్మాత మరియు ఆ చిత్రానికి డైలాగ్స్ రాసిన ముళ్ళపూడి వెంకటరమణ సమయానికి వేరే సిగరెట్స్ లేకపోవడంతో ఆయన డబ్బాలోంచే చెరకు సిగరెట్ తీసుకొని కాల్చారు.

ఇక అప్పుడే ఎన్టీఆర్ కూడా సిగరెట్ డబ్బా తెచ్చి ఇవ్వమని అడగగా ఫీల్ ఓపెన్ చేసిన డబ్బాని తీసుకెళ్లి ప్రొడక్షన్ బాయ్ ఎన్టీఆర్ కి ఇచ్చాడు.అది చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు ఎన్టీఆర్.సీల్ తీసిన ప్యాకెట్ తెస్తావా అంటూ ఆగ్రహించాడు.నిర్మాత తీసుకున్నాడు అని చెప్పినా కూడా ఎన్టీఆర్ వినలేదు.సీల్ ప్యాకెట్ తెచ్చి ఇస్తేనే షూటింగ్ కి వస్తానని రూమ్ లోనే కూర్చున్నాడు.చివరికి వేరే ప్రొడక్షన్ బాయ్ వూరంతా తిరిగి మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాక షూటింగ్ కి ఎన్టీఆర్ వచ్చాడు.
వెంకటరమణ సారీ చెప్పిన కూడా ఎన్టీఆర్ సిగరెట్ కోసం కాదు బ్రదర్ ప్రిన్సిపల్స్ ముఖ్యం వాటికి నేను బానిసను అంటూ చెప్పారట.







