స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచే ట్రిక్స్ ఇవే..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఉపయోగించని వారు చాలా అరుదు.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దాదాపుగా అన్ని పనులు అయిపోతాయి.

 Tips To Increase Internet Speed In Your Smartphone Details, Mobile Tips ,increas-TeluguStop.com

ఇక స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ కాస్త స్లో అయ్యిందంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది.అయితే కొందరేమో నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు.

నిజానికి ఇంటర్నెట్ స్పీడ్( Internet Speed ) తగ్గడానికి స్మార్ట్ ఫోన్ కూడా కొన్నిసార్లు కారణం అవుతుంది.మరి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఏ ట్రిక్స్ ఫాలో అవాలో చూద్దాం.

స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గితే వెంటనే ఫోన్ ను ఒకసారి రీస్టార్ట్ చేస్తే ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంది.ఫోన్ ను రీస్టార్ట్ చేస్తే ఫోన్లో ఉండే అన్ని ప్రోగ్రామ్ లు రిఫ్రెష్ అవుతాయి.స్మార్ట్ ఫోన్ ను కొన్ని సెకండ్ల పాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో( Airplane Mode ) ఉంచితే నెట్వర్క్ కనెక్షన్ రీసెట్ అవుతుంది.దీంతో ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది.

స్మార్ట్ ఫోన్ లో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది.కాబట్టి మీ ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడిందో లేదో చెక్ చేయాలి.

లేదంటే నెట్వర్క్ సెట్టింగ్ లను ఒకసారి రీసెట్ చేయాలి.ఇలా చేస్తే ఇంటర్నెట్ వేగం పెరిగే అవకాశం ఉంది.ఫోన్లో ఉండే యాప్ అప్డేట్ల కారణంగా ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంది.యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి.

అలా అప్డేట్ అవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది.పైన తెలిపిన ట్రిక్స్ ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని సులభంగా పెంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube