వేరుశనగ మొక్కలపై పెరిగే నల్లని బూజు నివారించే సరైన పద్ధతులు..!

వేరుశనగ మొక్కలపై( peanut plants ) పెరిగే నల్ల బూజు అనేది ఒక ఫంగస్.ఈ ఫంగస్ వల్ల వేరుశనగ కాయలు చెడిపోతాయి.

 Correct Methods To Prevent Black Mold Growing On Groundnut Plants , Trichoderma,-TeluguStop.com

ఈ ఫంగస్ గాలి, నేల, నీటి ద్వారా వ్యాపిస్తుంది.ఈ ఫంగస్ చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాలపై జీవిస్తుంది.

ఆరోగ్యకరమైన మొక్కలపై జీవిస్తుంది.ఈ నల్ల బూజు వల్ల విత్తనాలు మొలకెత్తకుండా కూలిపోయే అవకాశం ఉంది.

దెబ్బతిన్న మొక్క భాగాలు నీటిలో ఉబ్బిన గాయాలను కూడా చూపుతాయి.ఈ ఫంగస్ కాలర్ లేదా క్రౌన్ తెగులకు దారితీస్తుంది.

ఇది వేర్లు మెలికలు తిరిగిపోయి మొక్క పై భాగం వైకల్యం చెందేటట్లు చేస్తుంది.పంట నాణ్యత చాలావరకు దెబ్బతింటుంది.

Telugu Antifungal, Carbendazim, Groundnut, Mancozeb, Black Mold, Trichoderma-Lat

తెగులు నిరోధక, విత్తన శుద్ధి( Pest control, seed treatment ) చేసిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే ఏవైనా తెగుళ్లు ఆశిస్తే వ్యాప్తి చెందకుండా ఉంటుంది.తడి వాతావరణంలో పంటను కోయకూడదు.పంట కోతల అనంతరం పంట అవశేషాలను మొత్తం తొలగించి కాల్చి నాశనం చేయాలి.తప్పకుండా రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తీసేయాలి.

Telugu Antifungal, Carbendazim, Groundnut, Mancozeb, Black Mold, Trichoderma-Lat

సేంద్రియ పద్ధతిలో ఈ నల్ల బూజు నివారించాలంటే.ట్రైకోడెర్మా ( Trichoderma )తో మట్టిని బాగా తడపండి.వేపచెక్క యాంటీ ఫంగల్ లక్షణాలను( Antifungal properties ) కలిగి ఉంటుంది.రసాయన పద్ధతిలో ఈ నల్ల బూజును నివారించాలంటే.మాంకోజెబ్ ను కార్బెండజిమ్( Mancozeb , carbendazim ) తో కలిపి ఉపయోగించాలి.ట్రయాజోల్, ఎచినోకాండిన్ లాంటి యాంటీ ఫంగల్ మందులను ఉపయోగించి దీనిని పూర్తిగా నివారించి పంటను సంరక్షించుకోవచ్చు.

కాకపోతే వ్యవసాయ క్షేత్ర నిపుణులు ఏం చెబుతున్నారు అంటే.ఏ పంట సాగు చేసినా అధిక దిగుబడి సాధించాలంటే పంటకు ఎలాంటి చీడపీడలు లేదా తెగుళ్లు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేయాలి.

ఏవైనా ఆశించిన తర్వాత తొలి దశలో అరికట్టే ప్రయత్నం చేసిన ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube