ఒక సినిమాని మనం చూస్తున్నాం అంటే దాని వెనక చాలామంది కష్టమైతే దాగి ఉంటుంది.అందుకే ఒక సినిమాని సక్సెస్ చేయడానికి ప్రతి డైరెక్టర్ కూడా తమ వంతు కృషి చేస్తూ ముందుకు కదులుతూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి( Rajamouli ) కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఇందులో భాగంగానే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మంచి హిట్స్ ని అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
ఇప్పుడు ఇండియాలోనే ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనే విషయం లో ఇంకా క్లారిటీ రావడం లేదనే వార్తలు వస్తున్నాయి.
ఇక దానికి కారణం ఈ సినిమా విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా లేడట.అయితే ఈ కథలో కొన్ని కీలకమైన సన్నివేశాలని మళ్లీ మార్చి స్క్రిప్ట్ ని మళ్ళీ రీ రైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకుని ఉన్నారు.కాబట్టి ఇలాంటి సమయంలో ఈ స్క్రిప్ట్ ని పకడ్బందీగా చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే రాజమౌళి స్క్రిప్ట్ ని చాలా టైట్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు ఇక ఈ సినిమా కనక బాగా తీసినట్లైతే వరల్డ్ నెంబర్ 1 దర్శకుడుగా కూడా రాజమౌళి మారే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక మన తెలుగు దర్శకుడు ఆ స్థాయికి వెళ్తున్నాడు అంటే నిజంగా మనం అందరం గర్వించాల్సిందే…ఇక ఈ సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్( Pan World ) లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే బ్యాలెన్స్ అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.