చిరునవ్వు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది అనడంలో సందేహం లేదు.అయితే దంతాలు( Teeth ) తెల్లగా మెరుస్తూ కనిపిస్తే చిరునవ్వు మరింత అందంగా ఉంటుంది.
కానీ దంత సంరక్షణ లేకపోవడం, స్మోకింగ్, మద్యపానం, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం తదితర కారణాల వల్ల కొందరి దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.ఎన్ని రకాల టూత్ పేస్ట్ లను వాడిన సరే ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతుంటారు.
మీరు కూడా పసుపు దంతాలతో బాధపడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
దంతాలు పసుపు రంగులోకి( Yellow Teeth ) మారడానికి కారణాలు అనేకం.అలాగే పసుపు దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా అందుకు ఎంతగానో సహాయపడుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎండిన తులసి ఆకుల పొడిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న నిమ్మ తొక్కల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) మరియు కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్మూత్ గా తోముకోవాలి.
ఆపై దంతాలతో పాటు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని నిత్యం కనుక పాటిస్తే దంతాలు ఎలాంటి పసుపు రంగులో ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.
దంతాలను తెల్లగా మార్చడానికి ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.అలాగే తులసి, నిమ్మ తొక్కలు మరియు పసుపులో ఉండే పలు ప్రత్యేక గుణాలు దంతాలను మరియు చిగుళ్లను దృఢంగా ఆరోగ్యంగా మారుస్తాయి.చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.