కొంతమంది ప్రజలకు పెద్ద గాయాలైనా ఆ విషయం అంత త్వరగా తెలియదు.రక్తస్రావం( Bleeding ) అవుతున్నా వారు చీమ కూడా కుట్టనట్లు ఉంటారు.
బ్రెజిల్‌లో మెడిసిన్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి మాటియస్ ఫేసియో( Mateus Fazio ) కూడా ఈ కోవకు చెందిన వాడే.ఇటీవల ఈ యువకుడు రియో డి జనీరో ( Rio de Janeiro )సమీపంలో తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు.
అక్కడ మ్యూజిక్, బాణసంచాతో బీచ్ పార్టీ నిర్వహించారు.బీచ్‌లో సరదాగా గడుపుతుండగా అతడి తలకు ఏదో బలంగా తగిలింది.
అది ఏమిటో అతనికి తెలియదు.ఇది ఒక బండనా లేదా బాణసంచానా అని అతడు కొద్దిసేపు ఆలోచించి ఆ తర్వాత ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు.
అయితే నిజానికి అతడి తగిలింది బండో, ఫైర్ క్రాకర్ యో కాదు అది తుపాకీ నుంచి వచ్చిన ఓ బుల్లెట్.ఈ బుల్లెట్ మాటియస్ మెదడులోకి వెళ్లి అక్కడే ఉండిపోయింది.
మాటియస్‌కు( Mateus ) పెద్దగా నొప్పి కలగలేదు.సీరియస్‌గా అనిపించలేదు.ఆసుపత్రికి కూడా వెళ్లలేదు.బుల్లెట్ బ్రెయిన్ లో ఉన్నా సదరు యువకుడు ఎంచక్కా నాలుగు రోజులు పార్టీలో సెలెబ్రేషన్స్ కొనసాగించాడు.
సముద్రంలో ఈదాడు, స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నాడు.అతనికి ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు.
ఈ స్నేహితుడు ఒక కట్టు కట్టి, మందులు ఇచ్చాడు.అయితే బుల్లెట్ గురించి వారికి తెలియదు.
నాలుగు రోజుల తరువాత, మాటియస్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.దారిలో అతని చేయిలో వణుకు మొదలైంది.ఎందుకో తెలియలేదు, ఆందోళన చెందలేదు.అలసిపోయానేమో అని అనుకుని ఒక కునుకు తీశాడు.నిద్ర లేవగానే చేయి వింతగా అనిపించింది, దానిని బాగా కదిలించలేకపోయాడు, దాంతో భయం వేసి ఆసుపత్రికి వెళ్ళాడు.ఆసుపత్రిలో వైద్యులు కొన్ని పరీక్షలు చేసి, మెదడులో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు.
బుల్లెట్ అతని చేతిని నియంత్రించే మెదడులోని ఒక భాగంపై ప్రభావం చూపించింది.అయినా అతడు చనిపోలేదు అలాగే శాశ్వతంగా పక్షవాతం బారిన పడలేదు.
ఆలస్యమైతే ఏం జరుగుతుందో అని డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్స అవసరమని వారు చెప్పారు.అందుకు సదరు యువకుడు ఒప్పుకోవడంతో వైద్యులు రెండు గంటలు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్‌ను బయటకు తీశారు.
ఆపై రక్తస్రావం ఆపి, సంక్రమణను నిరోధించారు.శస్త్రచికిత్స విజయవంతమైంది.
మాటియస్ సురక్షితంగా ఉన్నాడు.
పోలీసులు ఆసుపత్రికి వచ్చి బుల్లెట్ తీసుకున్నారు.ఎవరు ఈ బుల్లెట్ కాల్చారో ఆరా తీయాలని అనుకున్నారు.ఆ రోజు బీచ్‌లో కాల్పులు జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవని వారు తెలిపారు.
ఇది మిస్టరీ అని, విచారణ చేస్తామని చెప్పారు.మాటియస్ కథ తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
వైద్యులు, నర్సులు, పోలీసులు, మీడియా కూడా నమ్మలేదు.ఇది ఒక అద్భుతం అని వారు చెప్పారు.
ఇది నమ్మశక్యంగా లేదని, ఇదొక మెడికల్ వండర్ అని పేర్కొన్నారు.