బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్( Shahrukh Khan ) కొడుకు ఆర్యన్ ఖాన్.( Aryan Khan ) సినిమాలతో తండ్రి బాలీవుడ్ లో చాలా ఫేమస్ కానీ వివాదాలతో ఆర్యన్ ఖాన్ చాలా ఫేమస్.
సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తండ్రిని మించిన కొడుకు అవుతాడు అనుకుంటే ఆర్యన్ ఖాన్ ఫోకస్ మాత్రం మరోలా ఉన్నట్టు అతనిపై వస్తున్న రూమర్స్ చూస్తే అర్థమవుతుంది.ఇటీవల డ్రగ్స్ కి ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
తండ్రి పరువు ఒక్క దెబ్బతో తీసేసాడు.ఎన్నో ఏళ్లుగా షారుక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ గా చలామణి అవుతున్నాడు.
కానీ అందరి స్టార్ కిడ్స్ లాగానే ఒక బ్రాట్ గా మిగిలిపోయాడు ఆర్యన్ ఖాన్.

అయితే వివాదాలు ఆర్యన్ ఖాన్ కి కొత్తేమీ కాదు కానీ రూమర్స్ అలాగే అమ్మాయిలతో డేటింగ్స్ లలో( Dating ) కూడా ఆర్యన్ బాగా ఫేమస్ అయిపోతున్నాడు.25 ఏళ్ల వయసులోనే చాలామందితో డేటింగ్ చేశాడు అంటూ ఆర్యన్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.ఈ వార్తలు ఇటీవల మరి జోరు అందుకున్నాయి.
ఎందుకంటే అతడు రకరకాల సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంటాడు కాబట్టి.పాకిస్తాన్ నటి మరియు మోడల్ అయినా సాదియా ఖాన్ తో( Sadia Khan ) డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రస్తుతం ఆర్యన్ గురించి బీటౌన్ లో చాలా మాట్లాడుకుంటున్నారు.

ఇంతకన్నా ముందు దుబాయిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ నోరా ఫతే తో( Nora Fatehi ) ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.కానీ ఆర్యన్ కన్నా నోరా ఐదేళ్లు వయసులో పెద్దది కాబట్టి కొంత మంది దీన్ని సీరియస్ గా తీసుకోకపోయినా మరి కొంత మంది వీరు ఇద్దరు కచ్చితంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాశారు.అంతకన్నా ముందు అనన్య పాండే తో( Ananya Panday ) కూడా ఆర్యన్ డేట్ చేశాడట.ఈ విషయాన్ని స్వయంగా అనన్య కాఫీ విత్ కరణ్ షో లో ఒప్పుకుంది.
ఆర్యన్ పై తనకు క్రష్ ఉందని చెప్పింది అంతే కాదు అతడు చాలా క్యూట్ అని కూడా చెప్పింది.ఇలా ఫాస్ట్ గా సోషల్ మీడియాకి ఎక్కుతూ ఉంటాడు
.






