తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ( CM Revanth Reddy )బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు అయినా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టలేదని బండి సంజయ్( Bandi Sanjay ) మండిపడ్డారు.
సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పి పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ లేఖలో కోరారు.