అనుకున్నదే అయ్యింది.కెనడాకు ( Canada ) వచ్చే విదేశీ విద్యార్ధులకు కొత్తగా మంజూరు చేయనున్న స్టడీ పర్మిట్లపై( Study Permits ) రెండేళ్ల పాటు పరిమితి విధించనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్( Immigration Minister Marc Miller ) సోమవారం ప్రకటించారు.
కెనడాలో పెరుగుతున్న గృహ సంక్షోభం, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మిల్లర్ తెలిపారు.గడిచిన దశాబ్ధంతో పోలిస్తే కెనడాలో విదేశీ విద్యార్ధుల సంఖ్య మూడింతలు పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
కెనడా ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్ధులకు పర్మిట్లు లభించే అవకాశం వుందని అంచనా.2023తో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ.2025కు సంబంధించిన అంచనాలను ఈ ఏడాది చివరిలో వెల్లడిస్తామని ఇమ్మిగ్రేషన్ మంత్రి తెలిపారు.అంతర్జాతీయ విద్యార్ధుల( International Students ) అనుమతి విధానాన్ని మరింత మెరుగుపర్చి వారికి ఉన్నత విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యతో పాటు తగినన్ని నివాసాలను అందుబాటులో వుంచాలని కూడా భావిస్తున్నట్లు మిల్లర్ తెలిపారు.ఎంతో ఆశతో కెనడాకు వచ్చే విదేశీ విద్యార్ధులకు నిరాశ కల్పించేలా వసతులు కల్పించకపోవడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే మంజూరు చేసిన పర్మిట్లు, మాస్టర్స్, డాక్టోరల్ విద్యార్ధులపై ఈ ఆంక్షల ప్రభావం వుండదని మార్క్ మిల్లర్ క్లారిటీ ఇచ్చారు.
అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లకు( Post Graduation Work Permits ) సంబంధించిన అర్హతల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది.కరికులం లైసెన్సింగ్ అరేంజ్‌మెంట్స్ కింద 2024 సెప్టెంబర్ నుంచి నమోదు చేసుకున్న విద్యార్ధులకు వర్క్ పర్మిట్ ఇవ్వబోమని తెలిపింది.

ఇకపోతే.కెనడా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పరిమితుల ప్రకారం ప్రావిన్స్‌ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు.సంస్థలు, వనరుల ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు విద్యార్ధులకు వాటిని పంపిణీ చేయాలి.పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్ ఆమోదమ ముద్ర తప్పనిసరి అని కెనడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన మార్పులు, చేర్పుల కోసం మార్చి 31 వరకు గడువిచ్చింది.







