మున్సిపల్ కమిషనర్ హామీతో సమ్మె విరమించిన కార్మికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు, ఇతర విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది తమ పిఎఫ్ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా 6 నెలల పిఆర్సి బకాయిలను అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిన్నటి నుండి పనులు బందు చేసి సమ్మె చేయడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ పాలకవర్గ సభ్యుల సమక్షంలో సిఐటియు నాయకులు , యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి పిఎఫ్ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కార్మికులకు రావాల్సిన పిఎఫ్ బకాయిలను అదేవిధంగా పిఆర్సి బకాయిలను విడుతల వారీగా మార్చి నెల నుండి అందజేస్తామని కార్మికులకు

 Rajanna Sircilla Municipal Workers Called Off The Strike With The Assurance Of T-TeluguStop.com

ఈఎస్ఐ కార్డులు, మున్సిపల్ నుండి ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని కార్మికులకు రక్షణ సామాగ్రి సబ్బులు , నూనెలు , చెప్పులు , బట్టలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కమిషనర్ హామీతో కార్మికులు సమ్మె విరమించి రేపటి నుండి విధులకు హాజరు కావడం జరుగుతుందని కార్మికుల సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారానికి హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ కి పాలకవర్గ సభ్యులకు సిఐటియు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ అధ్యక్షులు సుల్తాన్ నరసయ్య , కార్యదర్శి కాసారపు శంకర్ , భారతి , విజయ , పద్మ , మమత , రాజయ్య , అర్జున్ , బాబా కిషన్ యూనియన్ నాయకులు మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube