నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ దర్యాప్తు..!!

నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్( Passport ) జారీ కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇప్పటికే పలువురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

 Cid Investigation In Passport Issue Case With Fake Documents..!!,fake Documents,-TeluguStop.com

కొంతమందికి వీసాలు సైతం జారీ అయినట్లుగా సీఐడీ అధికారులు( CID Officials ) గుర్తించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కెనడా, స్పెయిన్ వీసాలు మంజూరు కావడంపై సీఐడీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

కేసు దర్యాప్తులో భాగంగా పలువురి పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే ఐదు జిల్లాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ నకిలీ పత్రాలతో 92 మంది పాస్ పోర్టులను పొందారని గుర్తించిన విషయం తెలిసిందే.నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్ పోర్టులను ముఠా సభ్యులు ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.నకిలీ పాస్ పోర్టులతో పాటు నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు( Educational Certificates ) తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube