ఒక్క హిట్ కొట్టిన హీరోలు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు.. సోహెల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

మామూలుగా బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) కి వెళ్లి వచ్చిన తర్వాత అతి కొద్ది మంది మాత్రమే కెరియర్ పరంగా బిజీ బిజీ అవుతూ ఉంటారు.అటువంటి వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా ఒకరు.

 Sohel Allegations On Small And Mid Heroes At Bootcut Balaraju Event, Sohel, Alle-TeluguStop.com

బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సోహెల్.కేవలం సోహెల్ ( Sohel )మాత్రమే కాకుండా సన్నీ( Sunny ) కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడాలనే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో చివరగా సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

Telugu Bigg Boss, Balaraju, Sohel, Tollywood-Movie

కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా సోహెల్ ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నారు.ఇప్పుడు బూట్ కట్ బాలరాజు( Boot Cut Balaraju ) అని వస్తున్నాడు.ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.

ఈ వేడుకకు తన బిగ్ బాస్ కంటెస్టెంట్లు గెస్టులుగా వచ్చారు.శివాజీ సైతం వచ్చాడు.

అయితే ఈ ఈవెంట్‌లో సోహెల్ కాస్త బరస్ట్ అయ్యాడు.చిన్న, మిడ్ హీరోల ప్రవర్తన మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఒక్క హిట్ కొట్టిన హీరోలు కూడా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారని, సోహెల్ అని చెప్పిన వెంటనే కట్ చేస్తున్నారని.తిరిగి రిప్లై కూడా ఇవ్వడం లేదని తన ఆవేదనను బయట పెట్టాడు.

షార్ట్ ఫిల్మ్స్ చేసినా, సీరియల్స్ చేసినా, సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌లు చేసినా కూడా ఓ రెండు కారణాలు ఉంటాయి.

Telugu Bigg Boss, Balaraju, Sohel, Tollywood-Movie

ఒకటి బతకడానికి, రెండు గుర్తింపు కోసం.ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఎలా మొదలు పెట్టినా పట్టించుకోవద్దు నేను షార్ట్ ఫిల్స్, కొత్త బంగారు లోకంలో జూ.ఆర్టిస్ట్ నుంచి కెరీర్ మొదలు పెట్టి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను.మన మీద మనకు నమ్మకం ఉండాలి.నిరంతరం పోరాడుతూ ఉండాలి.అదే నేను గట్టిగా నమ్ముతాను అని చెప్పుకొచ్చాడు సోహెల్.ఈ సందర్భంగా సోహెల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube