భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో సరికొత్త చరిత్ర సృష్టించనున్న రవిచంద్రన్ అశ్విన్..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది.తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25న ప్రారంభం కానుంది.

 Ravichandran Ashwin Will Create A New History In India Vs England Test Series ,-TeluguStop.com

టెస్ట్ సిరీస్( Test series ) కైవసం చేసుకోవడం కోసం ఇరుజట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది.

నేడు భారత జట్టు కూడా హైదరాబాద్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) ఓ సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించేందుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు.

ఈ టెస్ట్ సిరీస్ లో సరికొత్త చరిత్ర సృష్టించి, సువర్ణ అక్షరాలతో ఓ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Telugu Anil Kumble, India England-Sports News క్రీడలు

రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు భారత తరఫున 95 టెస్ట్ మ్యాచ్ లలో 179 ఇన్నింగ్స్ లలో 23.7 సగటుతో 490 వికెట్లు తీశాడు.500 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి మరో 10 వికెట్లు తీయాల్సి ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ కేవలం 10 వికెట్లు తీస్తే 500 వికెట్ల మైలురాయిని చేరుతాడు.హైదరాబాద్ లో జరిగే తొలి టెస్ట్ లో 500 టెస్ట్ వికెట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉంది.

Telugu Anil Kumble, India England-Sports News క్రీడలు

భారత్ తరుపున టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అనిల్ కుంబ్లే ( Anil Kumble )మొదటి స్థానంలో నిలిచాడు.అనిల్ కుంబ్లే 132 టెస్ట్ మ్యాచ్లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జూరెల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆవేష్ ఖాన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube