జనసేన జోనల్ కమిటీలతో ఆ పార్టీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) సమావేశం అయ్యారు.ఈ నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు.
ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో పర్యటించి నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.అలాగే మార్చి నెలలో మూడు వారాల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు.
పొత్తుల నేపథ్యంలో జనసేన, టీడీపీ( Janasena TDP ) అభ్యర్థుల విజయం కోసం పవన్ ప్రచారం చేస్తారని తెలిపారు.ఈ క్రమంలోనే ప్రతిరోజు మూడు సభల్లో జనసేనాని ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు.అయితే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత జోనల్ కమిటీలదేనని స్పష్టం చేశారు.పవన్ కోసం, పార్టీ కోసం పని చేసే ప్రతి జనసైనికుడిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు.