గురక సమస్య బాధితుల కంటే ఆ గురక( Snoring ) వినే వారికే ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది.దారుణంగా గురక పెడితే పక్కన వాళ్ళు అసలు నిద్ర పోలేరు.
దీనివల్ల గురకపెట్టే వారిని తిడుతుంటారు కూడా.అయితే ఒక వ్యక్తి గురక పక్కింటి వృద్ధుడిని చాలా డిస్టర్బ్ చేసింది.
ఆ వృద్ధుడు ఈ విషయంలో గురక తీసే వ్యక్తితో గొడవపడ్డాడు.చివరికి ఆ గొడవే అతడి ప్రాణాలను తీసేసింది.
వివరాల్లోకి వెళితే, ఫిలడెల్ఫియా( Philadelphia ) శివారులో గురక ఇద్దరు పొరుగువారి మధ్య పెద్ద గొడవకు దారితీసింది.క్రిస్టోఫర్ జేమ్స్ కేసీ (55)( Christopher James Casey ) బాగా గురక తీసేవాడు.

కేసీ గురక పెద్దగా పెడుతున్నాడని అతడి పొరుగింటి వ్యక్తి రాబర్ట్ వాలెస్( Robert Wallace ) ఎప్పుడూ కంప్లైంట్ చేసేవాడు.వారి మధ్య సన్నని గోడ ఉండటంవల్ల గురక శబ్దం వాలెస్‌ను బాగా ఇబ్బంది పెట్టేది.ఈ విషయంలో చాలా సార్లు గొడవయింది చివరికి రీసెంట్‌గా కేసీ కిటికీలోంచి రాబర్ట్ వాలెస్ ఇంట్లోకి ఎక్కాడు.ఆ తర్వాత 62 ఏళ్ల వాలెస్‌ను ఛాతీపై పెద్ద కత్తితో పొడిచాడు.
దాంతో అతడు చనిపోయాడు.వాలెస్ చాలా కోపంగా ఉండేవాడని కేసీ ఇంతకుముందు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలని వాలెస్, కేసీ అనుకున్నారు కానీ తర్వాత గొడవ అయ్యి కేసీ వాలెస్‌ను కత్తితో పొడిచి( Stabbed ) చంపేశాడు.కరోనర్ ప్రకారం, వాలెస్ గురువారం తన గాయాలతో మరణించాడు.కేసీని అరెస్టు చేసి అతనిపై పోలీసులు హత్య నేరం మోపారు.తనకు, వాలెస్‌కు ఒక సంవత్సరానికి పైగా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని అబింగ్టన్ ఆసుపత్రిలో ఉన్న కేసీ పోలీసులకు తెలిపాడు.







