సందీప్ కిషన్ కెరియర్ రిస్క్ లో ఉందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో సందీప్ కిషన్( Sundeep Kishan ) ఒకరు.ఇప్పటికే ఈయన చేసిన చాలా సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి.

 Is Sundeep Kishan S Career At Risk, Sundeep Kishan, Ooru Peru Bhairavakona, To-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమం లో ఈయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈయన కెరియర్ లో ఇప్పటివరకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే ఒక్క సినిమా మాత్రమే హిట్ సినిమా గా ఉంది.అందుకే ఇప్పుడు భారీ అంచనాలతో వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona )’ అనే సినిమా మీదనే తన అంచనాలు మొత్తం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే సందీప్ కిషన్ ఇండస్ట్రీలో ఉంటాడు.లేదంటే మాత్రం తను ఫేడ్ అవుట్ అయిపోతాడు అంటూ ఇప్పటికే చాలా వార్తలయితే వస్తున్నాయి.మరి ఇలాంటి క్రమంలో సందీప్ కిషన్ ఈ సినిమాతో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.ఇక సందీప్ కిషన్ కి మొదట్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆ సినిమాలతో తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు.

 Is Sundeep Kishan S Career At Risk, Sundeep Kishan, Ooru Peru Bhairavakona, To-TeluguStop.com

ఇక మధ్యలో కొంతమంది దర్శకులను నమ్మి మోసపోయాడు.ఇక ఇప్పుడు అలాంటి తప్పు చేయకూడదనే ఉద్దేశ్యం తోనే వీఐ ఆనంద్ కి మరొక అవకాశం ఇచ్చి తన లక్కు ను పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.ఇంక గతేడాది భారీ అంచనాలతో వచ్చిన మైఖేల్ సినిమా( Michael ) కూడా నిరాశపరచడంతో సందీప్ కిషన్ కెరీర్ డైలమా లో పడిపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమాతో కనక హిట్టు రాకపోతే మాత్రం హీరోగా తన కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక సందీప్ కిషన్ లాంటి ఒక టాలెంట్ ఉన్న హీరో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వకుడదంటే మాత్రం ఆయన తప్పకుండా సూపర్ సక్సెస్ కొట్టాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube