అండర్-19 ఐసీసీ( ICC ) పురుషుల వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది.జనవరి 19 శుక్రవారం ప్రారంభం అవనున్న ఈ వరల్డ్ కప్ 24 రోజులపాటు జరగనుంది.
మొత్తం 16 దేశాల మధ్య 41 మ్యాచ్లు జరగనున్నాయి.
నేడు డర్బన్ వేదికగా ఐర్లాండ్ వర్సెస్ అమెరికా( Ireland vs America ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ అండర్-19 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
మొత్తం 16 దేశాలు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి.ప్రతి గ్రూపులో నాలుగు దేశాలు ఉంటాయి.నాలుగు గ్రూపుల నుంచి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి.సూపర్ సిక్స్ దశ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ జరుగుతాయి.
ఫిబ్రవరి 6, 8 తేదీల్లో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లకు, ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది.

భారత జట్టు జనవరి 20న బంగ్లాదేశ్( Bangladesh ) తో, జనవరి 25న ఐర్లాండ్ తో, జనవరి 28న యూఎస్ఏ తో తలపడనుంది.భారత జట్టు 2000, 2008, 2012, 2018, 2022లలో అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది.ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ గెలిచిన భారత్ ఆరవసారి టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
భారత్ పై అంచనాలు భారీగానే పెరిగాయి.

అండర్-19 ప్రపంచ కప్ ఆడే భారత జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు, సౌమి కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, రాజ్ లింబాని నమన్ తివారీ.
అండర్-19 ప్రపంచకప్ లో పాల్గొనే 16 దేశాలు ఇవే.గ్రూప్ ఏ: భారత్, యూఎస్ఏ, ఐర్లాండ్, బంగ్లాదేశ్.గ్రూప్ బీ: వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్.గ్రూప్ సీ: జింబాబ్వే, శ్రీలంక, నమీబియా, ఆస్ట్రేలియా.గ్రూప్ డీ: పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్.







