నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే మీరు నాజూగ్గా మారడం ఖాయం!

ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది అధిక బరువు( Over Weight ) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.బరువు తగ్గి సన్నగా మారడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Drinking This Juice On An Empty Stomach Will Surely Make You Slimmer Details! Ab-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది వెయిట్ లాస్ కోసం తినడం మానేస్తుంటారు.కానీ కడుపు మాడ్చుకున్నంత మాత్రాన వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు అనుకుంటే పొరపాటే అవుతుంది.

నిజానికి బరువు తగ్గడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.అందులో ఇప్పుడు చెప్పబోయే ఏబిసిడి జ్యూస్( ABCD Juice ) కూడా ఒకటి.

ఈ జ్యూస్ ను నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో తాగారంటే మీరు నాజూగ్గా మారడం ఖాయం.మరి ఇంకెందుకు లేటు ఆ ఏబిసిడి జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.

Telugu Abcd, Amla, Beetroot, Carrot, Dates, Tips, Latest-Telugu Health

ఏ అంటే ఆమ్లా,( Amla ) బి అంటే బీట్ రూట్,( Beet Root ) సి అంటే క్యారెట్( Carrot ) మరియు డి అంటే డేట్స్.( Dates ) వీటితోనే మనం జ్యూస్ తయారు చేసుకోబోతున్నాము.బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీట్ రూట్ ముక్కలు, మూడు స్పూన్లు ఉసిరికాయ ముక్కలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.ఆపై ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

దీంతో మన ఏబిసిడి జ్యూస్ సిద్ధం అవుతుంది.

Telugu Abcd, Amla, Beetroot, Carrot, Dates, Tips, Latest-Telugu Health

ఈ జ్యూస్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.ప్రతిరోజు ఖాళీ కడుపుతో( Empty Stomach ) ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా పెరుగుతుంది.దీంతో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.

కొద్ది రోజుల్లోనే మీరు నాజూగ్గా మారతారు.బరువు తగ్గాలని భావించే వారికి ఈ ఏబిసిడి జ్యూస్ చాలా బాగా సహాయపడుతుంది.

పైగా ఈ జ్యూస్‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

మెదడు కూడా ఎంతో షార్ప్ గా పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube