ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మేనల్లుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.గురువారం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ మరియు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులను ముందుగానే ఆహ్వానించడం జరిగింది.టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పలువురు నాయకులను వైయస్సార్ షర్మిల ( YS Sharmila )స్వయంగా వాళ్ళ నివాసాలకు వెళ్లి ఆహ్వానించారు.

ఈ క్రమంలో గురువారం జనవరి 18వ తారీకు గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్( CM Jagan ) దంపతులు మరియు వైసీపీ పార్టీకి చెందిన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కాబోయే నూతన వధూవరులను సీఎం జగన్ దంపతులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17వ తారీకు జోధ్ పూర్ లో వివాహం జరగనుంది.వివాహం జరిగిన తర్వాత పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 24వ తారీఖు.
ఏర్పాటు చేయడం జరిగింది.వైయస్ రాజారెడ్డి( YS Raja Reddy ) అమెరికా డాలాస్ లో ఉన్నత చదువులు అభ్యసించిన సమయంలో అక్కడే చదువుతున్న ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ప్రేమించుకున్న ఈ ఇరువురు.కుటుంబ సభ్యులతో తెలియజేయడంతో వాళ్లు అంగీకరించడంతో ఈ పెళ్లి నిశ్చయమైంది.







