జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పర్యటించారు.విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు.
అన్నారం బ్యారేజీ కంటే మేడిగడ్డ బ్యారేజీలో భారీ నష్టం జరిగిందని విజిలెన్స్ డీజీ తెలిపారు.అన్నారం బ్యారేజీని, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని పేర్కొన్నారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను, హార్డ్ డిస్కులను వారం క్రితమే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.







