డైరెక్టర్ మారుతి ( Maruthi ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.చాలా రోజుల తర్వాత ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకునే దశలో ఉంది.ఇకపోతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో ప్రభాస్ ఎప్పటిలా కాకుండా విభిన్నమైనటువంటి లుక్ లో కనిపిస్తున్నారు.

ప్రభాస్ చాలా యంగ్ గా కనిపించడమే కాకుండా లుంగీలో కనిపించడంతో ఈ పోస్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయి.ఇక ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంతో ఉన్నారు.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

డైరెక్టర్ మారుతి ఈ సినిమా కథను పూర్తి చేసుకున్న తర్వాత ప్రభాస్ వద్దకు కాకుండా ముందుగా నాచురల్ స్టార్ నాని వద్దకు సినిమా కథతో వెళ్లారట ఈ కథను నానికి వివరించగా నాని కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.ఇలా నానీ రిజెక్ట్ చేయడంతో మారుతి ఈ కథతో ఎంతోమంది హీరోల వద్దకు వెళ్లారని అయితే ఎవరూ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పకపోవడంతో ఈయన ఈ కథలో పెద్ద ఎత్తున మార్పులను చేశారట.ఇలా మార్పులు చేసిన అనంతరం ప్రభాస్ వద్దకు వెళ్లగా ప్రభాస్ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తుంది.అలా రాజా సాబ్ ( Rajasaab ) సినిమా నాని చేయాల్సి ఉండగా నాని ( Nani )రిజెక్ట్ చేయడంతో ఎంతోమంది దగ్గరికి ఈ కథ వెళ్లి చివరికి ప్రభాస్ వద్దకు వచ్చిందని తెలుస్తుంది.
.






