బాటసారులకు టీ పోసి, వారి సమస్యలను వింటున్న చైనీస్ వృద్ధుడు.. నెటిజన్లు ఫిదా..

నేటి బిజీ ప్రపంచంలో చాలా మంది ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.వారి మెంటల్ హెల్త్( Mental Health ) గురించి ప్రియమైన వారు కూడా సరిగా పట్టించుకోవడం లేదు.

 Elderly Man In China Invites Passers-by To Tea Listens To Their Problems Details-TeluguStop.com

అయితే చైనాలో( China ) మాత్రం ప్రజల మానసిక బాధలు నయం చేసుకోవడానికి ఒక వృద్ధుడు( Old Man ) ఓ ఛాన్స్ అందిస్తున్నాడు.నిజానికి అతను చైనాలో నివసిస్తున్న ఫ్రెంచ్ బ్లాగర్.

( French Vlogger ) ప్రజలకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతిని అప్రోచ్ అయ్యాడు.అతను తనతో ఒక కప్పు టీ తాగడానికి, వారి సమస్యల గురించి మాట్లాడటానికి ప్రజలను ఆహ్వానిస్తాడు.

అతని పేరు రుయెల్ ఆలివర్ హెర్వ్.( Ruelle Olivier Herve ) జెజియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ నగరంలో నివసిస్తున్న రుయెల్‌కు @tealovinglaolu అనే వీబో అకౌంట్ ఉంది, అక్కడ రుయెల్ తన టీ సెషన్‌ల వీడియోలను పోస్ట్ చేస్తాడు.

ఈ వృద్ధుడు ఓ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో ఒక చిన్న స్టాల్‌ను ఏర్పాటు చేస్తాడు.టీ( Tea ) కాచుకుని తన వద్దకు వచ్చే వారి మాటలు వింటాడు.

రుయెల్ వారి ఆందోళనలను, సవాళ్లను తనతో పంచుకోవడానికి వారిని అనుమతిస్తాడు.

Telugu China, Elderly, French Vlogger, Latest, Nri, Ruelleolivier, Tea Stall-Lat

రుయెల్ రోడ్డు సైడ్ టీ స్టాల్‌కి( Tea Stall ) వచ్చిన వ్యక్తుల్లో ఒకరు యువతి జియాఫాంగ్. ఆమె అతనితో మాట్లాడుతూ “నేను నా గ్రాడ్యుయేషన్‌ను వాయిదా వేసుకున్నా.” అని చెప్పింది.దానికి రియాక్ట్ అవుతూ “ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఇదేనా?” అని రుయెల్ ప్రశ్నించాడు.ఆ తర్వాత ఆమె పరిస్థితి గురించి వారి మధ్య సంభాషణ జరిగింది.

Telugu China, Elderly, French Vlogger, Latest, Nri, Ruelleolivier, Tea Stall-Lat

అతని స్టాల్‌కి వచ్చిన మరొక వ్యక్తి యి టాంగ్, ట్రైనీ డిజైనర్. ఆమె కొత్త ప్రయాణానికి సిద్ధంగా లేనందున, గ్రాడ్యుయేట్ స్కూల్‌కు దరఖాస్తు చేయడం గురించి భయపడుతున్నట్లు అతనికి చెప్పింది.ఇలా చాలా మంది తమ ఆందోళనలను షేర్ చేసుకుంటూ రుయెల్ వద్ద ఎమోషనల్ రిలీఫ్( Emotional Relief ) పొందుతున్నారు.

రుయెల్ సోషల్ మీడియా ఖాతాలో వివిధ వ్యక్తులతో తన సంభాషణల వీడియోలను పంచుకున్నాడు, ఆ అకౌంట్‌కు దాదాపు 111,000 మంది అనుచరులు ఉన్నారు.

అతని వీడియోలు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్‌గా మారాయి.వీటిని చూసి చాలామంది అతడిని పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube