ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల</em( YS Sharmila ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని కలవడం జరిగింది.హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కి అందించారు.
ఈ సందర్భంగా పలు విషయాలపై షర్మిల మరియు పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది.కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )ని కూడా స్వయంగా ఇంటికి వెళ్లి వైయస్ షర్మిల కుమారుడు వివాహానికి హాజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
నేడు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు.ఈనెల 18న హైదరాబాద్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి( Raja Reddy ) నిశ్చితార్థం జరగనుంది.
ఫిబ్రవరి 17వ తారీఖున రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం జరగనుంది.
ఈనెల 18న హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో నిశ్చితార్థం జరగనుంది.
వివాహం ఫిబ్రవరి 17వ తారీఖు జోద్ పూర్ లో జరగనుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున హైదరాబాద్ లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది.
హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ నిర్ణయించారు.ఈ రిసెప్షన్ కి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో.వైయస్ రాజారెడ్డి పెళ్లి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.







