టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ అన్నారు.ఈ మేరకు రేపు చంద్రబాబును కలుస్తానని తెలిపారు.
ద్రోహం జరగడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చానని బొప్పన భవకుమార్ పేర్కొన్నారు.పని చేసేవాళ్లకు వైసీపీలో విలువ లేదన్నారు.
పనికిమాలిన వాళ్లకు పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు.ఈనెల 21వ తేదీన టీడీపీలో చేరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అయితే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బొప్పన భవకుమార్ నారా లోకేశ్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.







