ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను సింపుల్ గా డీయాక్టివేట్ ఎలా చేయాలంటే..?

ఇటీవలే కాలంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఇన్ స్టాగ్రామ్( Instagram ) కూడా ఒకటి.ఇన్ స్టాగ్రామ్ రీల్స్ యువతను ఎంతలా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Follow These Tips To Deactivate Instagram Account Details, Deactivate Instagram-TeluguStop.com

అయితే కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడడం వల్ల ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఒకవేళ డీ యాక్టివేట్( Deactivate ) చేయాలనుకుంటే.చాలా మంది సింపుల్ గా యాప్ అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.

అయితే ఖాతా డీ యాక్టివేట్ కోసం ఇలా యాప్ అన్ ఇన్ స్టాల్ చేయకుండా కొన్ని టిప్స్ పాటించి చాలా సులభంగా డీ యాక్టివేట్ చేయవచ్చు.మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాగ్రామ్ యాప్ తెరచి, మీ ప్రొఫైల్ కి వెళ్ళాలి.

దిగువన కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ చిత్రాన్ని( Profile Image ) ఎంచుకున్న తర్వాత కుడి వైపున పై భాగంలో మూడు లైన్స్ కనిపిస్తాయి.ఆ లైన్స్ ఎంచుకోవాలి.

ఇక సెట్టింగ్స్ గోప్యత ఎంపికను ఎంచుకోవాలి.ఆ తర్వాత అకౌంట్స్ సెంటర్ ఎంపికను తీసుకోవాలి.

అక్కడ కనిపించే వ్యక్తిగత వివరాలను ఎంచుకోవాలి.

Telugu Deactivate, App-Latest News - Telugu

ఇక చివరగా ఖాతా యజమాన్యం నియంత్రణ ఎంపికలు ఎంచుకొని క్రమరహితం లేదంటే తొలగింపు బటన్ నొక్కాలి.అయితే ఇక్కడ ఖాతా శాశ్వతంగా తొలగించాలా లేదంటే ఖాతాను తాత్కాలికంగా డీ యాక్టివేట్ చేయాలా అనేది ఎంచుకోవాలి.ఒకవేళ ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ ద్వారా ఖాతాను డీ యాక్టివేట్ చేయాలనుకుంటే.

ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ లో( Web Browser ) ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి, లాగిన్ అవ్వాలి.

Telugu Deactivate, App-Latest News - Telugu

ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత కింద ఎడమవైపు కనిపించే మూడు లైన్స్ ఎంచుకోవాలి.ఆ తర్వాత సెట్టింగ్ లపై క్లిక్ చేస్తే.అక్కడ వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి వాటిని ఎంపిక చేసుకోవాలి.

ఇక్కడ కూడా ఖాతాను శాశ్వతంగా తొలగించాలా లేదంటే ఖాతాను తాత్కాలికంగా డీ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి.అంతే ఇలా చాలా సింపుల్ గా యాప్ అన్ ఇన్ స్టాల్ చేయకుండా ఖాతా ను డీ యాక్టివేట్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube