ఈ సంక్రాంతి పండుగకు( Sankranti Festival ) బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడిన విషయం తెలిసిందే.గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగా లాంటి సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగాయి.
వీటిలో హనుమాన్ సినిమా హవానే ఎక్కువగా కనిపిస్తోంది.అయితే వచ్చే ఏడాది అనగా 2025 సంక్రాంతికి ఇంతకుమించి ఉండబోతోందట.
మరి 2025 సంక్రాంతి రేసులో ఏ ఏ సినిమాలు ఉన్నాయి అన్న విషయానికి వస్తే.మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్లు రూపొందుతున్న విశ్వంభర సినిమా( Viswambhara Movie ) వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అలాగే శతమానం భవతి సీక్వెల్ ని( Shatamanam Bhavati Sequel ) కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ వచ్చింది.ఈ యూనివర్స్ లో భాగంగా రెండో సినిమా అధీర సినిమాను( Adheera Movie ) వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.ఇక నాగార్జున బంగార్రాజు సీక్వెల్( Bangarraju Sequel ) కూడా 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది.
అలాగే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా సైతం వచ్చే పొంగల్ రేస్ లో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కాగా 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలయ్య బాబు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ నటించిన శతమానం భవతి విడుదల అయ్యాయి.ఈ మూడూ కూడా హిట్స్ గా నిలిచాయి.ఇక 2025 పొంగల్ బరిలో విశ్వంభర, శతమానం భవతి-2 తో పాటుగా బాలయ్య సినిమా కూడా నిలిస్తే 2017 వార్ రిపీట్ అవుతుంది.
మరి రిజల్ట్ కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి మరి.మరి వీటితోపాటు ఇంకా ఏఏ సినిమాలు 2025 సంక్రాంతి బరిలో చూడాలి మరి.







