క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ( Director Sukumar )తన సినిమాలలో లాజిక్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటాడు.ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన రంగస్థలం, పుష్ప సినిమాలు ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఉండవు.అందుకు కారణం ఈ లెక్కల మాస్టారు అన్ని అంచనా వేసుకొని సినిమాని రూపొందిస్తాడు.
ఎక్కడైనా ఏదైనా లాజిక్ మిస్ అయితే వెంటనే ఆ సన్నివేశాల్లో క్లారిటీ ఇచ్చేస్తాడు.అందుకే టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సుకుమార్‌కు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.
ఆయన ఎప్పుడూ విమర్శలు పాలు కాలేదు.

కానీ ఇప్పుడు అతను తీస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో చాలా లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్( Allu Arjun ) , హీరోయిన్ గా రష్మిక మందన్న( Rashmika Mandanna ) చేస్తున్నారు.పుష్ప: ది రైజ్ సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తోంది.దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకై ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.ఇలాంటి మూవీలో లాజిక్కులు మిస్సైతే సుకుమార్ కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ.పైగా ఈ డైరెక్టర్ ఒక్క సినిమా కూడా చెత్తగా రాకుండా చూసుకుంటాడు.
ఆ పేరు చెడినట్లు అవుతుంది.అందుకే ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా లాజిక్ లేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో క్రాస్ చెకింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పుష్ప 2 సినిమా ఫైనల్ ఔట్ పుట్ చూసాక, సుక్కు కొన్ని లాజిక్ లేని సీన్లు గుర్తించినట్లు సమాచారం.వాటిని ఇప్పుడు మారుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సన్నివేశాలు మార్చడానికి సుకుమార్ బాగానే కష్టపడుతున్నట్లు టాక్.

ఇకపోతే ఆగస్టు 15న పుష్ప -2 సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పుడే అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులకు అందజేశారు.ప్రస్తుతం మూవీకి సంబంధించి మిగిలిపోయిన పనులు అన్నిటినీ త్వరగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమై చివరి దశకు చేరుకున్నట్లు సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి.మరి ఈ సినిమాతో సుకుమార్ రాజమౌళి లాగా హై రేంజ్ కి వెళ్తాడో, లేదంటే మామూలు హిట్ తో సరిపెట్టుకుంటాడో చూడాలి.
ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ కూడా వేరే రేంజ్ కి వెళ్ళిపోతాడు.







