ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా( Spirit Movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద ప్రభాస్( Prabhas ) అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే ఇప్పటికే సందీప్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి.

ప్రతి హీరోని చాలా బోల్ట్ గా చూపిస్తాడు అంటూ ఆయన మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి.ఇక ఈయన చేసిన మూడు సినిమాల్లో కూడా హీరో ఎవరైనా కూడా అదే బోల్డ్ నెస్ లో చూపించడం తనకి అలవాటు.మరి ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.నిజానికి ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ గా ( Police Officer ) కనిపించబోతున్నాడు అంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నప్పటికీ సందీప్ వంగ( Sandeep Vanga ) కూడా అదే క్లారిటీని ఇస్తున్నాడు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా రాబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

నిజానికి సందీప్ రీమేక్ సినిమాలు అయితే చేయడు, కానీ ఇప్పుడు ఎందుకు అలాంటి ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి వచ్చింది అంటూ తన అభిమానులు కూడా కొంతవరకు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే ఇది నిజంగానే హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా( Hollywood Remake ) రాబోతుందా అనే విషయాల మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు.ఇక దీని మీద సందీప్ గాని, ప్రభాస్ గాని స్పందిస్తే తప్ప ఈ విషయం లో సమాధానం దొరకదు…ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే సందీప్ పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకుంటాడు.








