భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ జనవరి 25న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ కు( Test Series ) ముందే భారత్ పై మాటల దాడి మొదలుపెట్టేసింది.
భారత్ వేదికగా టెస్ట్ సిరీస్ జరగడం భారత్ కు ఒక ప్లస్ పాయింట్.స్పిన్ బౌలర్లకు ఉపయోగపడే పిచ్ లను రూపొందిస్తారు.
ఇక తొలి రోజు నుంచి బంతి తిరగనప్పటికీ తమ ఇంగ్లాండ్ జట్టు భారత్ పై ఎలాంటి ఫిర్యాదు చేయదని ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ ఒలీ పోప్( Ollie Pope ) తెలిపాడు.అంటే భారత జట్టులో మంచి స్పిన్ బౌలర్లు( Spin Bowlers ) ఉండడం, అందుకు తగ్గట్టుగా పిచ్ లను భారత్ ఏర్పాటు చేయడం వల్ల ఇంగ్లాండ్ అనుకున్నా రీతిలో పరుగులు చేయడం కష్టమని ఇంగ్లాండ్ జట్టుకు అప్పుడే భయం పట్టుకుంది.

భారత్ తమ స్పిన్నర్లకు సహాయపడే ట్రాక్లతో ముందుకు సాగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదంటు, ఈ విషయంపై తాము ఫిర్యాదు చేయబోమని ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ ఒలీ పోప్ చెప్పాడు.అయితే స్పిన్నింగ్ పిచ్ ల కారణంగా ఇంగ్లాండ్ జట్టు( England Team ) భారత గడ్డపై అనుకున్న రీతిలో పరుగులు చేయలేదు.కానీ అలాంటి పిచ్ లపై అనుకున్న రీతిలో పరుగులు తీయడానికి కచ్చితంగా తమ ఇంగ్లాండ్ జట్టు ఒక మార్గాన్ని కనుక్కుంటుందని పోప్ చెప్పాడు.

ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ ఇలా చెప్పడంలో ఇంగ్లాండ్ జట్టు స్ట్రాటజీలో ఒక భాగం అయి ఉండవచ్చు.పోప్ ఒక కొత్త వైఖరిని అవలంబించాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇంగ్లాండ్ చేస్తున్న మాటల దాడిని బట్టి ఈ టెస్ట్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ వేదికగా( Hyderabad ) మొదటి టెస్ట్ మ్యాచ్ జనవరి 25 నుండి 29 వరకు జరగనుంది.విశాఖపట్నం ( Vishakapatnam ) వేదికగా రెండవ టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు జరగనుంది.
రాజ్ కోట్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరగనుంది.రాంచీ వేదికగా నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుండి 27 వరకు జరగనుంది.
ధర్మశాల వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుండి 11 వరకు జరగనుంది.







