బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయిన శివాజీ( Sivaji ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో ద్వారా ఓపికతో ఉండటం నేర్చుకున్నానని ఆయన అన్నారు.నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఉన్నానని అయితే తప్పును ఎప్పుడూ అంగీకరించనని ఆయన తెలిపారు.
నాకు ఒక లైన్ ఉంటుందని ఆ లైన్ ను క్రాస్ చేయనని శివాజీ కామెంట్లు చేశారు.నేను బిగ్ బాస్ హోస్ట్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.
అన్నిటికంటే గొప్పదని మనస్సని శివాజీ చెప్పుకొచ్చారు.చంద్రబాబు( Chandrababu naidu )ను అరెస్ట్ చేయడం గురించి శివాజీ స్పందిస్తూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు అవతలి వాళ్లను తొక్కాలని ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు.ప్రతికారంతో చేసే రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదని శివాజీ వెల్లడించారు.చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి మేలు చేసిందని ఆయన పేర్కొన్నారు.టీడీపీ జనసేన పొత్తు( TDP , Jana Sena ) గురించి నేను ఫోకస్ పెట్టలేదని శివాజీ అన్నారు.
నేను బీజేపీ గురించి మాట్లాడనని ఆయన పేర్కొన్నారు.ఎవరి అవకాశాలను వాళ్లు వాడుకుంటున్నారని శివాజీ పేర్కొన్నారు.ప్రకృతి సమతౌల్యం దెబ్బ తింటే నేచర్ దానిని కరెక్ట్ చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను డబ్బులపై దృష్టి పెట్టానని శివాజీ అన్నారు.బిగ్ బాస్ షోను తిట్టేవాళ్లు చాలామంది ఉన్నారని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బయట హీరోగా ఉన్నవాళ్లు కూడా లోపలికి వెళ్లిన తర్వాత మారుతుందని ఆయన అన్నారు.
బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన వాళ్లు చాలా ప్రాక్టికల్ లైఫ్ ను అనుభవిస్తారని శివాజీ వెల్లడించారు.తను నటించిన వెబ్ సిరీస్( Web Series ) గురించి శివాజీ మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పులు సూచించలేదని ఆయన అన్నారు.