సాధారణంగా క్రిమినల్స్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల్లో యమ స్పీడుగా పోతుంటారు.వీరిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు( Police ) కూడా చేజ్ చేస్తుంటారు.
దీనివల్ల రోడ్డుపై ఒక యాక్షన్ సీన్ తలపిస్తుంటుంది.గూస్ బంప్స్ తెప్పించే ఇలాంటి చేజ్‌లు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.
అయితే వాటిని మించిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్( Twitter ) వేదికగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు బిజీ రోడ్డుపై రామ్ 1500 అనే లైట్ డ్యూటీ పికప్ ట్రక్ మోడల్ రోడ్డుపై దూసుకెల్లడం చూడవచ్చు దీన్ని ఒక పోలీస్ కార్ వెంటాడుతోంది ఆ పోలీస్ కార్ కెమెరాలు ట్రక్కు చాలా వేగంగా వెళ్లడం మనం చూడవచ్చు.1-వైలో, 2-వేలో, ఆప్పొసిట్ లైన్‌లో ఆ వాహనం దూసుకెళ్తూ పోలీసుల నుంచి తప్పించుకుంది.ఆ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తుంటే అతడు డ్రైవింగ్ లో ఎంత నైపుణ్యం సంపాదించాడో అర్థం అవుతుంది.
ఈ వీడియో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.పోలీస్ కార్ మాత్రం ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules )అతిక్రమించలేదు.
అలాగే రూల్స్ అన్నీ బ్రేక్ చేసిన కారును త్వరగా పట్టుకోలేకపోయింది.
ఈ హై ఇంటెన్స్ చేజ్ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @PicturesFoIder షేర్ చేసింది.
షేర్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి కోట్లలో వ్యూస్ వచ్చాయి.లక్ష దాక లైక్స్ వచ్చాయి.
ఇలాంటి చేజ్‌లను త్వరగా ముగిస్తే బాగుంటుందని, లేదంటే చాలామంది ప్రాణాలు రిస్క్‌లో పడతాయని కొందరు పేర్కొన్నారు.ఈ చేజ్ చూసేందుకు అద్భుతంగా ఉందని మరి కొంతమంది అన్నారు.
సామాన్య ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టే ఈ ప్రాక్టీస్ కు ముగింపు పలకాలని కొందరు కోరారు.దీనిని మీరు కూడా చూసేయండి.







