ఎక్కువగా చెమట పట్టడం అన్నది మనల్ని తరచుగా ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది.అయితే కొంచెం దూరం నడిచిన కూడా ఒళ్లంతా చెమటలు( Excessive Sweating ) పట్టే వారు చాలామంది ఉన్నారు.
కానీ కొందరికి అసలు చెమట పట్టదు.అయితే చెమటలు పట్టడం సహజం.
కానీ సాధారణంగా చెమటలు పట్టడం ఆరోగ్యకరమైన శరీరానికి సంకేతం.ఏదైనా శారీరక శ్రమ జరిగినప్పుడు చెమట పడుతుంది.
కానీ కొంతమంది ఏమి చేయకుండానే చెమటలు పడుతుంటాయి.అలా మీ శరీరం కూడా విపరీతంగా చెమటపడుతోందా? అలా అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.బహుశా ఇది చాలా పెద్ద వ్యాధికి సంకేతం. చెమట ఎక్కువగా పడితే దానికి కారణం ఏమిటి? దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక చెమట అన్నది ఆరోగ్యానికి హానికరం.ఇది ఒక రకమైన వ్యాధి అని చెప్పవచ్చు.హైపర్ హైడ్రోసిస్( Hyperhidrosis ) అనీ పిలవబడే ఈ పరిస్థితి లక్షణం అధిక చమట.ఎక్కువగా చెమట పట్టినప్పుడు శరీరం నుండి ఎక్కువ నీరు కోల్పోతారు.అధిక చెమటకు ఎన్నో కారణాలు ఉన్నాయి.గుండె కవాటం, వాపు, ఎముక సంబంధిత ఇన్ఫెక్షన్, హెచ్ఐవి, ఇన్ఫెక్షన్ లాంటి అనేక రకాల వ్యాధులు కూడా ఉన్నాయి.విపరీతమైన చెమట గుండె జబ్బులకు( Heart Diseases ) సంకేతం కావచ్చు.కొన్నిసార్లు ఒత్తిడి కూడా అధిక చెమటకు కారణం అవుతుంది.
విపరీతంగా చెమట పట్టేవారు ముందుగా ఆహారంపై శ్రద్ధ వహించాలి.

అంతేకాకుండా ఉప్పు వాడకాన్ని( Salt ) తగ్గించాలి.మద్యపానానికి దూరంగా ఉండాలి.ఇక గర్భధారణ సమయంలో అధిక చెమటను అనుభవిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి.
మీ ఆహారంలో విటమిన్లు పుష్కలంగా ఉండే పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి.అయితే విపరీతంగా చెమట పట్టేవారు పుష్కలంగా నీరు తాగాలి.
అలాగే శరీరం వేడెక్కకుండా ఉండేందుకు కాటన్ దుస్తులను ధరించాలి.నీరు ఎక్కువగా తాగడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
అలాగే శరీరం నుండి అధిక చెమట కూడా తగ్గుతుంది.