బాలయ్య సినిమాలో ఆఫర్ వచ్చినా అందుకే నో చెప్పా.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!

సాధారణంగా బాలయ్య( Balayya ) సినిమాలో అవకాశం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.అయితే ఒక నటి మాత్రం తాను బాలయ్య సినిమాను రిజెక్ట్ చేశానని చెబుతున్నారు.

 Actress Ashrita Vemuganti Comments About Balakrishna Details Here Goes Viral ,b-TeluguStop.com

ప్రముఖ నటి అశ్రిత వేముగంటి( Actress Asrita Vemuganti ) మాట్లాడుతూ సినిమాలు అంటే కుటుంబంలో వద్దనే మాట్లాడతారని ఆమె అన్నారు.నేను ఉన్నత చదువులు చదివానని ఆమె పేర్కొన్నారు.

నేను ఏది చేసినా కొంచెం సిన్సియర్ గానే చేశానని అశ్రిత వెల్లడించారు.పెళ్లి చేసుకొని సినిమాలు చేయాలని అమ్మ సూచనలు చేసిందని ఆమె పేర్కొన్నారు.

మాది పెద్దలు కుదిర్చిన వివాహం అని అశ్రిత వెల్లడించారు.నా భర్త వయస్సులో పెద్ద అయినా చూడటానికి నాకంటే చిన్నగా కనిపిస్తారని ఆమె అన్నారు.బరువు పెరగడం గురించి ఆమె మాట్లాడుతూ కొన్ని కామెంట్లు అయితే వచ్చాయని అశ్రిత పేర్కొన్నారు.నేను అంత సన్నగా ఎప్పుడూ లేనని ఆమె వెల్లడించారు.

కరోనా తర్వాత యోగా చేస్తూ యాక్టివ్ గా ఉన్నానని అశ్రిత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Ashrita, Balakrishna, Balayya, Prakash Raj, Tollywood-Movie

నా భర్త హెల్త్ కేర్ లో ఉన్నారని కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు నాకు దేవుళ్లలా కనిపించారని అశ్రిత పేర్కొన్నారు.సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ ను నేనే ఫైనల్ చేసుకున్నానని ఆమె వెల్లడించారు.మేల్ యాక్టర్స్ కు, ఫిమేల్ యాక్టర్స్ కు రెమ్యునరేషన్ విషయంలో తేడా ఉందని అశ్రిత వెల్లడించారు.

ప్రకాష్ రాజ్( Prakash Raj ) గారు ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తారని ఆమె పేర్కొన్నారు.

Telugu Ashrita, Balakrishna, Balayya, Prakash Raj, Tollywood-Movie

బాహుబలికి ముందు ఒకే ఒక్క సీరియల్ చేశానని అశ్రిర అన్నారు.సీరియల్స్ అనేది వేరే ప్రపంచం అని అశ్రిత వెల్లడించారు.బాలయ్య బాబీ కాంబో మూవీలో ఆఫర్ వచ్చిందని 10 రోజులు ఔట్ డోర్ షూటింగ్ అని చెప్పడంతో ఆ సినిమాను మిస్ చేసుకున్నానని అశ్రిత వెల్లడించారు.

అశ్రిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube