రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజ స్వామి దేవస్థానం రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ అనిల్ కుమార్, ప్రత్యేక పూజలు చేశారు.మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ అందజేశారు.
వారి వెంట ఈఈ రాజేష్, డి ఈ రఘునందన్, ఏఈఓ లు హరికృష్ణ, జయ కుమారి బ్రహ్మన్న, శ్రీనివాస్, ప్రతాప్, నవీన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు ఆలయ ఇన్స్పెక్టర్ సంకపల్లి పవన్, సిసి ఎడ్ల శివ ఉన్నారు.